బావ కోసం అతిధి పాత్రలో మహేశ్ బాబు! | Mahesh Babu to make cameo in 'Krishnamma Kalipindi Iddarini' | Sakshi
Sakshi News home page

బావ కోసం అతిధి పాత్రలో మహేశ్ బాబు!

Jul 2 2014 12:36 PM | Updated on Sep 2 2017 9:42 AM

బావ కోసం అతిధి పాత్రలో మహేశ్ బాబు!

బావ కోసం అతిధి పాత్రలో మహేశ్ బాబు!

ప్రస్తుతం ఆగడు షూటింగ్ లో బిజీగా ఉన్న మహేశ్ బాబు తన బావ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' అనే చిత్రంలో కనిపించనున్నారు

సూపర్ స్టార్ మహేశ్ బాబు అతిధి పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ప్రస్తుతం ఆగడు షూటింగ్ లో బిజీగా ఉన్న మహేశ్ బాబు తన బావ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇప్పటికి వరకు ఇతర హీరోలు నటించిన 'జల్సా', 'బాద్ షా' చిత్రాల్లో వాయిస్ ఓవర్ కే పరిమితయ్యారు. 
 
ఈ చిత్రంలో మహేశ్ కోసం ఓ ప్రత్యేక పాత్ర రూపొందించాం. మహేశ్ కు పాత్ర గురించి చెప్పగానే చేయడానికి ముందుకొచ్చారు. మా చిత్రంలో మహేశ్ కనిపించడానికి సుధీర్ ఎంతో కృషి చేశారని దర్శకుడు చంద్రు అన్నారు. ఆగడు షూటింగ్ పూర్తయిన వెంటనే మహేశ్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారన్నారు. 
 
కన్నడంలో విజయం సాధించిన చార్మినార్ అనే చిత్రం రీమేక్ గా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుధీర్ బాబు సరసన నందిత నటిస్తుండగా, గిరిబాబు, ఎంఎస్ నారాయణ, కిషోర్ దాస్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement