లైఫ్ ఈజ్ ఫెస్టివల్ | Life is festival: Rakul preet singh chit chat with cityplus about Diwali festival | Sakshi
Sakshi News home page

లైఫ్ ఈజ్ ఫెస్టివల్

Oct 23 2014 12:45 AM | Updated on Sep 2 2017 3:15 PM

లైఫ్ ఈజ్ ఫెస్టివల్

లైఫ్ ఈజ్ ఫెస్టివల్

తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా మారిన యూత్‌ఫుల్ హీరోయిన్ రకూల్ ప్రీత్‌సింగ్.

తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా మారిన యూత్‌ఫుల్ హీరోయిన్ రకూల్ ప్రీత్‌సింగ్. లౌక్యం విజయం, కరెంట్ తీగ విడుదలకు సిద్ధంగా వుండటంతో పాటు వరుస సినిమా షెడ్యూల్‌తో బిజీగా మారింది రకూల్. విజయాలు సంతోషాలు కలిసిన ఈ దీపావళి తనకెంతో స్పెషల్ అంటూ పండుగ ముచ్చట్లు ‘సిటీప్లస్’తో పంచుకుంది.
 
 రెండేళ్లుగా వర్క్ షెడ్యూల్‌తో దీపావళి సెలబ్రేషన్ కుదరటం లేదు. ఈసారి పండుగ కోసం షూటింగ్ కు ఓ రోజు లీవ్ తీసుకుని మరీ ఇంటికెళ్తున్నా. రోజంతా ఫ్యామిలీతోనే గడిపేస్తాను. గతేడాదితో పోలిస్తే ఈసారి దివాలీ నాకు చాలా స్పెషల్. లౌక్యం హిట్, కరెంట్ తీగ సినిమాతో జోష్‌తో ఉన్నా. చిన్నప్పుడు క్రాకర్స్ బాగా కాల్చేదాన్ని. టెన్త్ క్లాస్ నుంచి మానేశాను. దీపాలు, రంగోలీలతో ఇళ్లంతా అలంకరిస్తాను.
 
 సేవ్  అండ్ సేవ
 దివాలీ అంటే వెలుగులతో పాటు సంతోషాన్ని పంచడం కూడా. అందుకే పండుగ వేళ సంబరాల కోసం స్పెండ్ చేసే డబ్బులో కొంత చారిటీకి వినియోగిస్తుంటాను. క్రాకర్స్‌పై ఖర్చు మానేసి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని నా ఆలోచన. పండుగకు స్వీట్లూ కొనుక్కోలేని వాళ్లుంటారని, వారి కోసం ఏదైనా చేయగలిగితే బాగుంటుందని చిన్నప్పుడు నాన్న చెప్పిన మాట నచ్చింది. అప్పటి నుంచి నాకు చేతనైన సాయం చేస్తుంటాను.
 
 హెల్పింగ్ నేచర్..
 ఈ నాయిస్, పొల్యూషన్ వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగకుండా దీపావళి జరుపుకోవాలి. పెట్స్‌కి, ఆస్పత్రులు, పేషెంట్స్ వున్న చోట వారికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటే అందరికీ హ్యాపీ. సంతోషంగా, సురక్షితంగా పండుగ జరుపుకోవాలి. ఈ పండుగ సందర్భంగా మంచి మనసుతో వైజాగ్ హుదూద్ తుపాను బాధితులకు వీలైనంత సాయం అందిస్తే బాగుంటుంది.
 - ఓ మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement