కుబేరులకు దిమ్మతిరిగిపోయేలా...

Kylie Jenner Become US Youngest Self-Made Billionaire - Sakshi

వయసు కేవలం 20 సంవత్సరాలు. అయితేనేం సంపాదనలో మహా మహా మిలీనియర్లతో సైతం పోటీపడింది. చివరకు ఫోర్బ్స్‌లిస్ట్‌లో చోటు సంపాదించుకుని కుబేరులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. 

న్యూయార్క్‌: అమెరికన్‌ మోడల్‌ కైలీ జెన్నర్‌.. వయసు 20 ఏళ్లు మాత్రమే.. కైలీ ఏం చేస్తే అదే ఫ్యాషన్‌. యువత బ్లైండ్‌గా ఆమె స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. రెండేళ్ల క్రితం కైలీ కాస్మోటిక్స్‌ పేరిట ఓ సంస్థను ప్రారంభించగా.. అది కాస్త 630 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయి చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ‘100 పర్సంట్‌’ పేరిట లిప్‌ కిట్‌(29 డాలర్లకు కిట్‌) అమ్మకాల బిజినెస్‌ను ప్రారంభించి.. రెండేళ్లలో గణనీయంగా ఆదాయాన్ని వెనకేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆదాయం టాక్స్‌ మినహాయింపులుపోనూ సుమారు 900 మిలియన్‌ డాలర్లపై(భారత కరెన్సీలో 6 వేల కోట్లకుపై మాటే).  

ఈ మేరకు ఫోర్బ్స్‌ మాగ్జైన్‌ ప్రత్యేక శీర్షికలో ఆమె గురించి ఓ వ్యాసం ప్రచురించింది. యంగెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ యూఎస్‌ బిలినియర్‌ పేరిట కైలీ గురించి ఆ ప్రత్యేక కథనం ప్రస్తావించింది. గతంలో ఈ రికార్డు ఫేస్‌బుక్‌ యాజమాని మార్క్‌ జుకర్‌బర్గ్‌(23) పేరిట ఉండగా.. ఇప్పుడు కైలీ(20) ఆ రికార్డు బద‍్ధలు కొట్టింది. ఇదిలా ఉంటే కైలీ ప్రముఖ మోడల్‌, నటి కిమ్‌ కర్దాషియన్‌కు బంధువు. ట్రావిస్‌ స్కాట్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్న కైలీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పలు టీవీ షోలు, సినిమాల్లో సైతం నటించిన ఈ యంగ్‌ మోడల్‌కు సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top