రెండోసారి | Kriti Sanon joins Akshay Kumar in Bachchan Pandey | Sakshi
Sakshi News home page

రెండోసారి

Nov 15 2019 4:40 AM | Updated on Nov 15 2019 4:40 AM

Kriti Sanon joins Akshay Kumar in Bachchan Pandey - Sakshi

కృతీ సనన్‌

‘హౌస్‌ఫుల్‌ 4’తో ఈ మధ్యనే థియేటర్స్‌లో సందడి చేశారు అక్షయ్‌ కుమార్, కృతీ సనన్‌. సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మాణంలో ఫర్హాన్‌ సమ్‌జీ ఈ సినిమా రూపొందించారు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాణంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బచ్చన్‌ పాండే’. తమిళంలో అజిత్‌ నటించిన ‘వీరమ్‌’ సినిమాకు ఇది హిందీ రీమేక్‌. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకుడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతీ సనన్‌ నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ఈ క్రిస్మస్‌ని మరింత స్పెషల్‌గా మార్చడానికి కృతీసనన్‌ మాతో కలసి వస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఈ టీమ్‌తో మళ్లీ కలసి పని చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు కృతీసనన్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement