కోలీవుడ్‌కు శ్రద్ధా శ్రీకాంత్ | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు శ్రద్ధా శ్రీకాంత్

Published Thu, May 26 2016 3:15 AM

కోలీవుడ్‌కు శ్రద్ధా శ్రీకాంత్ - Sakshi

మలయాళం, కన్నడం వంటి ఇతర భాషల్లో ఒక్క చిత్రం హిట్ అయితే చాలు ఆ చిత్ర కథానాయికలకు తమిళంలో అవకాశాలు ఖాయం అని చెప్పవచ్చు. నటి సమంత రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు ప్రచారంలో ఉన్న కన్నడంలో మంచి విజయం సాధించిన యూటర్న్ చిత్ర నాయకి శ్రద్ధా శ్రీకాంత్‌కు అప్పుడే కోలీవుడ్‌లో కాలింగ్ వచ్చేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రం ఫేమ్ నివీన్ పౌలీ తమిళంలో హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో శ్రద్ధా శ్రీకాంత్ హీరోయిన్‌గా దిగుమతి అవుతున్నారు.ఈ చిత్రానికి నవ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ మోగాఫోన్ పడుతున్నారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడన్నది గమనార్హం.

ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న శ్రద్ధాశ్రీకాంత్ తన గురించి తెలుపుతూ తను తండ్రి ఆర్మీ అధికారి అన్నారు. దీంతో తన కుటుంబం దేశంలోని పలు ప్రాంతాలు తిరగాల్సిన పరిస్థితి అన్నారు. ఆ కారణంగా తనకు పలు సంస్కృతులకు చెందిన వారితో కలిసి మెలిసి జీవించిన అనుభవం కలిగిందన్నారు.వారి సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఇక తమది విద్యావంతుల కుటుంబం అని తెలిపారు. తాను లా చదివి న్యాయవాదిగా పని చేశానని చెప్పారు.

ఇది తన జీవితంలో ఒక భాగం అయితే నటనపై అసక్తి అన్నది చిన్నతనం నుంచి ఉందన్నారు. అది మోహంగా మారడంతో స్టేజీ ఆర్టిస్ట్‌గా నటనలో మెలికలు నేర్చుకున్నానన్నారు. పలు స్టేజీ ప్రొగ్రాంలలో పాల్గొన్న తనకు యూటర్న్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని వివరించారు. ఆ చిత్రంలో తన నటనకు పలువురి ప్రశంసలు లభించాయన్నారు. తాజాగా గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమిళ సినిమాలన్నా, తమిళ ప్రజలన్నా తనకు చాలా గౌరవమని అన్నారు. ఇక్కడ తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటాననే నమమకం ఉందని అంటున్నారు శ్రద్ధా శ్రీకాంత్.

Advertisement
 
Advertisement