పవన్ సినిమాలో సీనియర్ హీరోయిన్ | Khushboo in Pawan Kalyan, Trivikram Srinivas Film | Sakshi
Sakshi News home page

పవన్ సినిమాలో సీనియర్ హీరోయిన్

Dec 28 2016 11:05 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ సినిమాలో సీనియర్ హీరోయిన్ - Sakshi

పవన్ సినిమాలో సీనియర్ హీరోయిన్

ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ

ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆ కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

అత్తారింటికి దారేది సినిమాలో కీలక పాత్రకు సీనియర్ నటి నదియాను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొత్త సినిమా కోసం మరో సీనియర్ నటిని తీసుకొస్తున్నాడు. గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమాతో చిరుకు అక్కగా నటించిన ఖుష్బు, పవన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఖుష్బు స్వయంగా కన్ఫామ్ చేసింది. తన ట్విట్టర్ పేజ్లో త్రివిక్రమ్ పవన్ల సినిమాలో నటిస్తున్నట్టుగా తెలిపింది కుష్బు.

Advertisement
 
Advertisement
Advertisement