కత్తిలాంటోడు! | kathi lanti kurradu movie shooting Started | Sakshi
Sakshi News home page

కత్తిలాంటోడు!

Sep 17 2016 12:22 AM | Updated on Sep 4 2017 1:45 PM

కత్తిలాంటోడు!

కత్తిలాంటోడు!

విస్సుశ్రీ కథానాయకుడిగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రం ‘కత్తిలాంటి కుర్రాడు’.

విస్సుశ్రీ కథానాయకుడిగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రం ‘కత్తిలాంటి కుర్రాడు’. జంగాల నాగబాబు దర్శకత్వంలో భద్రాద్రి మూవీస్ పతాకంపై ఎన్.నాని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ప్రేమ, వినోదం, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం. ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. కత్తిలాంటి కుర్రాడు ఏం చేశాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరుప్రముఖ హీరోయిన్స్ నటిస్తారు. వి.సత్యానంద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు’’ అన్నారు.
 

Advertisement

పోల్

Advertisement