ప్రాణాలతో బయటపడిన హీరోయిన్ | karunakaran turns hero in real life, saves amy jackson | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో బయటపడిన హీరోయిన్

Mar 6 2015 9:14 AM | Updated on Sep 2 2017 10:24 PM

తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు.

తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అది కూడా ఎవరో కాదు.. హాలీవుడ్ నుంచి కోలీవుడ్కు దిగొచ్చిన భామ ఎమీ జాక్సన్ని. ఇటీవల 'ఐ' చిత్రంలో నటించిన ఎమీ తాజాగా మరో తమిళ చిత్రంలో నటిస్తోంది.

 

ఈ చిత్రానికి తిరుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కరుణాకరన్ హాస్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను కేరళలో షూటింగ్ చేస్తున్నారు. చిత్రీకరణలో భాగంగా ఓ కొండపై బైక్ రైడింగ్ సీన్లో నటిస్తున్న ఎమీ ఒక్కసారిగా బైక్పై నుంచి జారిపడి కొండమీద నుంచి కిందపడబోయిందట. సరిగ్గా అదే సమయంలో వెనకాలే మరో బైక్పై ఉన్న కరుణాకరన్ ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించి అసలైన హీరోగా మారాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement