కంగనా చీర ఫోటోపై నెటిజన్ల కామెంట్‌

Kangana Ranaut Rs 600 Worth Saree Pic Gets Trolled - Sakshi

హీరోయిన్లు ధరించే దుస్తుల పట్ల అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. అందుకే వారు బయటికొచ్చినప్పుడు కళ్లు చెదిరే  ఖరీదైన దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ధరించిన ఓ చీర గురించి ఇంటర్నెట్‌లో చర్చ ప్రారంభమయ్యింది.  ఎందుకంటే కంగనా కట్టుకుంది కేవలం రూ.600 విలువ చేసే ఓ చేనేత చీర కావడం ఇక్కడ విశేషం. ఈ క్రమంలో కంగనా సోదరి రంగోలి ‘ఈ చీరను కంగన కోల్‌కతాలో రూ.600కు కొన్నది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి తను చాలా ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను  నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై తను చాలా బాధపడింది’ అంటూ ట్వీట్‌ చేసింది. దాంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్‌ చేసింది.

అయితే రంగోలి ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆమె ధరించిన చీర ఖరీదు రూ.600 సరే బాగానే ఉంది. మరి ఆమె చేతిలో పట్టుకున్న ప్రాడా హ్యాండ్‌ బ్యాగ్‌ 2-3లక్షల రూపాయల ఖరీదు చేస్తుంది. సన్‌ గ్లాసెస్‌, చెప్పులు అన్నింటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మీరు మాత్రం కేవలం చీర గురించే గొప్పగా చెప్తున్నారు. ఏది ఏమైనా మీ ప్రచారం కూడా చాలా అమూల్యమైనదే’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top