పైలట్‌గా మారిన బ్యూటీ | Kajal Aggarwal Flew An Aircraft | Sakshi
Sakshi News home page

Oct 7 2018 10:13 AM | Updated on Oct 7 2018 2:37 PM

Kajal Aggarwal Flew An Aircraft - Sakshi

పైలట్‌ అయి విమానాన్ని నడిపేశానని సంబరపడిపోతోంది నటి కాజల్‌ అగర్వాల్‌. ఏంటీ ఇదేదో సినిమాలో ఈ బ్యూటీ పైలెట్‌గా నటిస్తోందని అనుకుంటున్నారా? కాదండీ బాబు. మగువ పైలెట్‌లయ్యారంటే ఒకప్పుడు నమ్మశక్యం కాదేమోగానీ, ఈ రోజుల్లో అసాధ్యమేమీ కాదు. మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. అలా నటి కాజల్‌ విమానాన్ని ఈజీగా విమానాన్ని నడిపేసింది.

సాహసాలు చేయడాన్ని చాలెంజ్‌గా తీసుకుంటానంటున్న కాజల్‌అగర్వాల్‌కు ఈ మధ్య అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. చేతిలో ఇప్పుడు రెండు చిత్రాలే ఉన్నాయి. దీంతో అమ్మడు తన స్నేహితులతో టూర్లు చెక్కేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తోంది. అంతేకాదు సాహస విన్యాసాలు చేసేస్తోంది. ఆ సంగతేంటో కాజల్‌నే అడుగేద్దాం.

ఏంటీ తెగ ఆనందపడిపోతున్నారన్న ప్రశ్నకు కాజల్‌ బదులిస్తూ ‘జీవితంలో నిజమైన సంతృప్తి మనం ఊహించని విధంగా చేసే సాహసంతో కలుగుతుంది. కొంచెం ధైర్యం, తెలివి ఉంటే చాలు అలాంటి అనుభవాలను పొందవచ్చు. అలాంటి అనుభవాలను నేను చాలా చవి చూశాను. అందులో విమానాన్ని నడిపిన అనుభవం ఒక్కటి. అదో మధురమైన అనుభవం.

స్నేహితులతో కలిసి ఇటీవల కౌలాలంపూర్‌ వెళ్లాను. అక్కడ ఒక ప్రైవేట్‌ జెట్‌ విమానాన్ని తీసుకున్నాం. నలుగురు మాత్రమే కూర్చోవడానికి అందులో వీలవుతుంది. నేను పైలట్‌ పక్క సీటులో కూర్చున్నాను. అ సమయంలో విమానాన్ని నడపాలన్న కోరిక పుట్టింది. అందుకు పైలెట్‌ సహకరించారు. ఆయన సూచనలతో నేనే విమానాన్ని నడిపి ఆకాశాన్ని చుట్టొచ్చాను.

ఎత్తైన భవనాల మధ్య విమానం దూసుకుపోతుంటే భలే థ్రిల్‌ ఫీలయ్యా. ఆ సమయంలో ట్విన్‌ టవర్‌పైగా విమానాన్ని నడపాలని ఆశ కలిగింది. అయితే అలా పయనించకూడదని పైలెట్‌ చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. మొత్తం మీద విమానాన్ని నడిపిన అనుభూతి మరచిపోలేనిది. ఇలాంటి సాహసాలు ఇంతకు ముందు కూడా చాలా చేశాను’ అని కాజల్‌ అగర్వాల్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement