ఐస్‌క్రీమ్‌ కోసం జిమ్‌ | Kajal Agarwal Eating Ice Cream | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌ కోసం జిమ్‌

May 29 2018 1:54 AM | Updated on Aug 3 2019 12:45 PM

Kajal Agarwal Eating Ice Cream  - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

ఐస్‌క్రీమ్‌ని ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎవరికైనా సరే ఐస్‌క్రీమ్‌ని చూడగానే నోరూరాల్సిందే. నేనూ దానికి మినహాయింపేం కాదు అంటున్నారు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ఐస్‌క్రీమ్‌ మీద తనకున్న ప్రేమను కాజల్‌ పంచుకుంటూ – ‘‘సాధారణంగా షూటింగ్స్‌ కోసం చాలా ప్రదేశాలు తిరుగుతుంటాను. ఎన్ని చోట్లు తిరిగినా కూడా నాతో పాటు ఎప్పుడూ ఉండేది మాత్రం ఐస్‌క్రీమే. నా రూమ్‌ ఫ్రిజ్‌ డోర్‌ ఓపెన్‌ చేస్తే ఫస్ట్‌ కనపడేవి ఐస్‌క్రీమ్స్‌. కొన్ని విషయాలు ఫ్యామిలీ పరంగా వస్తాయి అంటుంటారు కదా.. ఈ ఐస్‌క్రీమ్‌ అబ్‌సెషన్‌ కూడా అలాంటిదేనేమో. మా ఇంట్లో అందరూ ఐస్‌క్రీమ్‌ను బాగా ఇష్టంగా తింటాం. ఫిట్‌గా ఉండాలంటే ఎక్కువ ఐస్‌క్రీమ్‌లు తినకూడదని అంటుంటారు. కానీ నేను మాత్రం ఐస్‌క్రీమ్‌ కోసం ఇంకొంచెం సేపు జిమ్‌లో ఎక్కువ కష్టపడతాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా, ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారీ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement