జయంతో నిశ్చయమేనా!

Kajal Agarwal Confirmed For Bellamkonda Sai Srinivas - Sakshi

రీసెంట్‌ టైమ్స్‌లో తెలుగు, తమిళ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన రెండు చిత్రాలు చేస్తున్నారామె. అలాగే బాలీవుడ్‌ హిట్‌ ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’లో నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పుడు తమిళంలోనే ‘జయం’ రవితో కాజల్‌ జోడీ కట్టనున్నారట.

ఈ జోడీ ‘జయం’ రవి హీరోగా నటించిన ‘బోగన్‌’ సినిమాకే కుదరాల్సింది. కానీ ఎందుకో వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు ‘జయం’ రవి హీరోగా రూపొందనున్న ‘తని ఒరువన్‌’ (తెలుగులో ‘ధృవ’) సీక్వెల్‌కి కాజల్‌ని తీసుకున్నారని టాక్‌. అయితే సాయేషా పేరు కూడా వినిపిస్తోంది. మరి.. ‘జయం’ రవితో కథానాయికగా ఎవరు నిశ్చయమయ్యారు? అనేది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top