తొలి 1బిలియన్‌ డాలర్స్‌ ఆర్‌-రేటెడ్‌ సినిమా 'జోకర్‌'

Joaquin Phoenix Joker Becomes First R rated Film To Cross 1Billion worldwide - Sakshi

జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించిన అమెరికన్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'జోకర్‌' మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక‌్షన్లను స్థిరంగా కొనసాగిస్తుంది. అక్టోబర్‌ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'జోకర్‌' సినిమాలో వయొలెన్స్‌ ఎక్కువగా ఉందని కొందరు విమర్శకులు పెదవి విరిచినా మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా  1 బిలియన్‌ డాలర్లు దాటిన తొలి ఆర్‌-రేటెడ్ సినిమా(హింసాత్మకంగా భావించినప్పటికీ)గా నిలిచింది.

ఆర్‌- రేటడ్‌ జాబితాలో ఇంతకుముందు 2018లో వచ్చిన ర్యాన్ రేనాల్డ్స్ నటించిన కామెడి థ్రిల్లర్‌ 'డెడ్‌పూల్ ‌2' సినిమా (78.3), 'డెడ్‌పూల్‌'(75.4) మిలియన్‌ డాలర్లు వసూలు చేయగా, తాజాగా జోకర్‌ ఆ సినిమాల రికార్డును అధిగమించింది. అంతేగాక చైనాలో ఆర్‌-రేటడ్‌ సినిమాలను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ జోకర్‌ సినిమాను మాత్రం చైనా ప్రేక్షకులు హిట్‌ సినిమాగా నిలిపారు. జోకర్‌గా నటించిన జోక్విన్‌ ఫీనిక్స్‌ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 62.3 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో వార్నర్‌ బ్రదర్స్‌, డీసీ ఫిలిమ్స్‌ సంస్థ జోకర్‌ సినిమాను తెరకెక్కించగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు. డీసీ ఫిలిమ్స్‌ సంస్థ రూపొందించిన ఆక్వామెన్‌, ది డార్క్‌ నైట్‌ రైజస్‌, ది డార్క్‌ నైట్‌ సినిమాలు 1బిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, తాజాగా ఆ జాబితాలో జోకర్‌ నాలుగో స్థానాన్ని సంపాందించింది.


ది డార్క్‌ నైట్‌ సినిమాలో జోకర్‌ పాత్రలో హెత్‌ లెడ్జర్‌

బ్యాట్‌మెన్‌ సిరీస్‌ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ది డార్క్‌నైట్‌ సినిమాలో జోకర్‌ పాత్ర విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భయంకరమైన జోకర్‌గా నటించిన హెత్‌ లెడ్జర్‌ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా ఇంటరాగేషన్‌ సీన్‌లో జోకర్‌ పాత్రలో హెత్‌ లెడ్జర్‌ వెకిలి నవ్వులు ఎవరు అంత తొందరగా మరిచిపోలేరు. దాని నుంచి ప్రేరణగా తీసుకొని ఒక సీరియల్‌ కిల్లర్‌ గా జోకర్‌ ఎందుకు మారాడనే బ్యాక్‌డ్రాఫ్‌లో జోకర్‌ చిత్రం తెరకెక్కింది. జోకర్‌ పాత్రకు ప్రాణం పోసిన హెత్‌ లెడ్జర్‌ 2008 లో డ్రగ్స్‌కు బానిసై చనిపోవడంతో ఈ సినిమాలో జోక్విన్ ఫీనిక్స్ జోకర్‌ పాత్రను ధరించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top