సవ్యంగా సాగిపోవాలి

janhvi kapoor visits golden temple - Sakshi

తన కొత్త సినిమా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌. కార్తీక్‌ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్‌ హీరోహీరోయిన్లుగా నటించనున్న హిందీ చిత్రం ‘దోస్తానా 2’.  ఈ సినిమాకు కొల్లిన్‌ డి కున్హా దర్శకుడు. 2008లో అభిషేక్‌ బచ్చన్, జాన్‌ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ముందు కాస్త సమయం దొరకడంతో అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకున్నారు జాన్వీ కపూర్‌. ‘దోస్తానా 2’ చిత్రాన్ని బాలీవుడ్‌ బడా దర్శక–నిర్మాత కరణ్‌జోహార్‌ నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top