‘గ్యాంగ్‌ స్టార్స్‌‌’లో జగ్గుభాయ్‌

Jagapati Babu In Gangstars  Web Series - Sakshi

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న సీనియర్‌ నటుడు జగపతిబాబు డిజిటల్‌ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే రానా లాంటి ఫాంలో ఉన్న యంగ్‌ హీరోలు కూడా వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా జగపతిబాబు కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు.

డార్క్‌ కామెడీగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టార్స్‌ వెబ్‌ సిరీస్‌లో జగపతిబాబు గూండా కృష్ణదాస్‌ పాత్రలో కనిపించనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ‘దడ’ ఫేం అజయ్ భుయాన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. శ్వేత బసు ప్రసాద్‌, నవదీప్‌, పోసాని కృష్ణ మురళి, శివాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. జూన్‌ 1న తొలి ఎపిసోడ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top