మహేశ్‌ మర్మం ఏంటో? | Is Marmam the title of Mahesh Babu-Murugadoss film? | Sakshi
Sakshi News home page

మహేశ్‌ మర్మం ఏంటో?

Mar 3 2017 11:59 PM | Updated on Aug 3 2019 1:14 PM

మహేశ్‌ మర్మం ఏంటో? - Sakshi

మహేశ్‌ మర్మం ఏంటో?

హైదరాబాద్‌.. ముంబయ్‌.. అహ్మదాబాద్‌... ఇండియా అంతా చుట్టేస్తున్నారు మహేశ్‌బాబు.

హైదరాబాద్‌.. ముంబయ్‌.. అహ్మదాబాద్‌... ఇండియా అంతా చుట్టేస్తున్నారు మహేశ్‌బాబు. మరోపక్క బ్యాంకాక్‌లో క్లైమాక్స్‌ని చిత్రీకరించాలను కుంటున్నారట! ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

వచ్చే జూన్‌ 23న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కానీ, ఇప్పటివరకూ టైటిల్‌ ఏంటో మాత్రం చెప్పలేదు. ‘ఏజెంట్‌ శివ’, ‘సంభవామి’ టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి ‘మర్మం’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. మరి.. ఈ మూడు టైటిల్స్‌లో ఏదో ఒకటిని ఖరారు చేస్తారా? లేక వేరే టైటిల్‌ పెడతారా? అనేది వేచి చూడాలి. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement