ఇట్స్‌ ఏ వైన్‌ సాంగ్‌!

Iruttu Arayil Murattu Kuthu to be shot in Thailand- - Sakshi

రెండు చుక్కలు నోట్లో పడితే... రెండో మనిషి బయటకొస్తాడు. మత్తులో ఏవేవో చేస్తారు. కొందరు మాంచి హుషారున్న పాటేసుకుంటారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి... మత్తులోంచి వచ్చే పాటలు మస్తుగా మజా స్టెప్పులేయిస్తాయి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు గౌతమ్‌ కార్తీక్‌. మణిరత్నం ‘కడలి’తో కథానాయకుడిగా పరిచయమైన ఈ హీరో, ప్రస్తుతం తమిళంలో ‘ఇరతు అరయిల్‌ మురతు కుతువు’ అనే సినిమా చేస్తున్నారు. అందులో ‘నెక్ట్స్‌ నువ్వే’ (తెలుగు సినిమా) ఫేమ్‌ వైభవీ శాండల్య హీరోయిన్‌. ఈ సినిమా కోసం ఇప్పుడో మత్తుపాటను... అదేనండీ ‘వైన్‌ సాంగ్‌’ను షూట్‌ చేస్తున్నారు.

హీరో వైన్‌ షాపులో రెండు చుక్కలు వేసిన తర్వాత ఈ పాట మొదలవుతుందట. అతను ఏ బాధలో ఉన్నాడో మరి! ‘‘బాబా భాస్కర్‌ మాస్టర్‌ వైన్‌ సాంగ్‌కి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సూపర్బ్‌గా వస్తోందీ సాంగ్‌. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం థాయ్‌లాండ్‌ వెళతాం’’ అన్నారు చిత్రదర్శకుడు సంతోష్‌ పి. జయకుమార్‌. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... కలప్రభు దర్శకత్వంలో గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా ‘ఇంద్రసేన’ సినిమా చేస్తున్నారు. అందులోని టు మినిట్స్‌ బైక్‌ అండ్‌ జీప్‌ రేస్‌ కోసం 10 రోజుల పాటు రిహార్సల్‌ చేసి సూపర్‌గా నటించారట! ఆయన కమిట్‌మెంట్‌ చూసి, టీమ్‌ను షాక్‌కు గురి చేశారట గౌతమ్‌ కార్తీక్‌. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేస్తారట!!

Back to Top