ఇళయదళపతి దుమ్మురేపే ఇంట్రో సాంగ్ | intro song in Vijay Bhairawa | Sakshi
Sakshi News home page

ఇళయదళపతి దుమ్మురేపే ఇంట్రో సాంగ్

Oct 22 2016 2:12 AM | Updated on Sep 4 2017 5:54 PM

ఇళయదళపతి దుమ్మురేపే ఇంట్రో సాంగ్

ఇళయదళపతి దుమ్మురేపే ఇంట్రో సాంగ్

ఇళయదళపతి విజయ్ చిత్రాల్లో ఆయన అభిమానులను ఖుషీ పరిచే దుమ్మురేపే ఇంట్రోసాంగ్ చోటు చేసుకోవడం

ఇళయదళపతి విజయ్ చిత్రాల్లో ఆయన అభిమానులను ఖుషీ పరిచే దుమ్మురేపే ఇంట్రోసాంగ్ చోటు చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది. విజయ్ ఇంట్రో సాంగ్స్ అన్నీ విశేష ఆదరణ పొందాయన్నది గమనార్హం. అలాంటి సాంగ్ ఆయన తాజా చిత్రంలోనూ ఉంది. విజయ్ భైరవా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. కీర్తీసురేశ్ నాయకి. అపర్ణా వినోద్, జగపతిబాబు, సతీష్, డేనియల్ బాలాజీ, శ్రీమాన్, వైజీ.మహేంద్రన్, హరీష్ ఉత్తమన్, తంబిరామయ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. విజయ్ ఇంత వరకూ పలు చిత్రాల్లో నటించినా భైరవా చిత్రం లాంటి కథా చిత్రంలో ఆయన ఇంత వరకూ నటించలేదని దర్శకుడు అంటున్నారు. చిత్రంలో సమాచారానికి అవసరం అయిన విషయం, నేటి తరానికి కావలసిన అంశాలు ఉన్నాయని తెలిపారు. కాగా భైరవా చిత్రంలో మొత్తం ఐదు గీతాలు ఉంటాయట. వాటన్నిటినీ గీత రచయిత వైరముత్తునే రాశారు. అందులో పట్టైయ కిలప్పు పట్టైయ కిలప్పు పట్టి తొట్టి ఎలామ్ అనే ఇంట్రో సాంగ్ ఉందట. ఈ సాంగ్‌ను ఇటీవలే బిన్ని మిల్లులో చిత్రీకరించారు. ఇందులో విజయ్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ, హేయ్ బ్రో హిందీ చిత్రం ఫేమ్ నుపుర్‌శర్మ స్టెప్‌లు వేశారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement