అందుకే క్లోజ్‌గా ఉంటాను | Iam very professional, says Deepika Padukone | Sakshi
Sakshi News home page

అందుకే క్లోజ్‌గా ఉంటాను

Nov 5 2013 11:27 PM | Updated on Apr 3 2019 6:23 PM

అందుకే క్లోజ్‌గా ఉంటాను - Sakshi

అందుకే క్లోజ్‌గా ఉంటాను

తాను ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నా... ఆ హీరోతో ఎఫైర్ నడుపుతున్నట్లుగా వార్తలు పుట్టించేస్తున్నార ని బాలీవుడ్ భామ దీపికా పదుకొనె మీడియా సాక్షిగా అసహనం వ్యక్తం చేశారు.

తాను ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నా... ఆ హీరోతో ఎఫైర్ నడుపుతున్నట్లుగా వార్తలు పుట్టించేస్తున్నార ని బాలీవుడ్ భామ దీపికా పదుకొనె మీడియా సాక్షిగా అసహనం వ్యక్తం చేశారు. ఈ ముద్దుగుమ్మ ‘రామ్‌లీలా’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కథానాయకుడైన రణవీర్‌సింగ్‌తో తాను సహజీవనం చేస్తున్నట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ‘రామ్‌లీలా’లో రణవీర్, దీపికాలు రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయారని, నిజజీవితంలో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండటం వల్లే... కెమెరా ముందు కూడా అంత బాగా సన్నివేశాలను రక్తికట్టించగలిగారని ఆ కథనాల సారాంశం.
 
వీటితో విసిగిపోయిన దీపిక మీడియాతో మాట్లాడుతూ -‘‘కథను అర్థం చేసుకొని నటిస్తే ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆటోమేటిగ్గా పండుతుంది. అంతే తప్ప సదరు నటుడితో ఎఫైర్ ఉండటం వల్లో, లేక అతనితో క్లోజ్‌గా తిరగడం వల్లో సన్నివేశాలు పండవు. ఈ గాలి కబుర్లు సృష్టించేవారు... తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఆర్టిస్టుగా నేను చాలా ప్రొఫెషనల్ . షూటింగ్ వాతావరణం ఆహ్లాదంగా ఉండటానికి, పని సజావుగా సాగడానికి, సన్నివేశాలు సహజంగా రావడానికీ సహ నటులతో క్లోజ్‌గా ఉంటాను. అది తప్పేం కాదే. దానికి మీ ఇష్టం వచ్చినట్లు ఊహిస్తే ఎలా’’ అంటూ ఘాటుగా స్పందించారు దీపిక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement