వార్‌ హీరో | History comes alive with 'Subedar Joginder Singh | Sakshi
Sakshi News home page

వార్‌ హీరో

Dec 21 2017 5:36 AM | Updated on Dec 21 2017 5:36 AM

History comes alive with 'Subedar Joginder Singh - Sakshi

ప్రతి సినిమాకి ఓ హీరో ఉంటాడు. కానీ దేశానికి నిజమైన హీరోలు మాత్రం సైనికులే. దేశపౌరుల స్వేచ్ఛ కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో సైనికులు చరిత్రలో నిలిచిపోయారు. అటువంటి వారిలో ముఖ్యులు పరమ వీర చక్ర గ్రహీత సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌. ఈయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌: ట్రూ స్టోరీ ఆఫ్‌ ఏన్‌ ఆన్‌సంగ్‌ వార్‌ హీరో’. గిప్పి గ్రేవాల్, గుగ్గుగిల్, కల్విందర్‌ బిల్లా, ఆదితి శర్మ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌ పాత్రను గిప్పి గ్రేవాల్‌ చేస్తున్నారు. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. సిమర్‌జిత్‌ దర్శకత్వంలో సుమీత్‌ సింగ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement