‘సీతాకోక చిలుక’లాంటి ప్రేమకథ!
తెలుగు తెరపై వచ్చిన హృదయానికి హత్తుకునే ప్రేమకథల్లో ‘సీతాకోక చిలుక’ ఒకటి. ఓ బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ యువతి మధ్య సాగే ప్రేమకథతో రూపొందిన ఆ చిత్రం నాటి తరాన్నే కాదు.. ఇప్పుడు విడుదలైనా నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటుంది.
తెలుగు తెరపై వచ్చిన హృదయానికి హత్తుకునే ప్రేమకథల్లో ‘సీతాకోక చిలుక’ ఒకటి. ఓ బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ యువతి మధ్య సాగే ప్రేమకథతో రూపొందిన ఆ చిత్రం నాటి తరాన్నే కాదు.. ఇప్పుడు విడుదలైనా నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ సినిమా గురించి ప్రస్తావించడానికి కారణం ఉంది.
బాయ్స్, ప్రేమిస్తే తదితర చిత్రాల ద్వారా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ రియల్ లైఫ్ లవ్‌స్టోరీ అచ్చంగా ఈ రీల్ స్టోరీలానే ఉంటుంది. తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భరత్ క్రిస్టియన్ యువతి జెస్సీని వివాహం చేసుకోబోతున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏడాది క్రితం ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం జరిగిందని సమాచారం. అయితే ‘సీతాకోక చిలుక’ చిత్రంలో లా వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించలేదు..
సమ్మతించారు. దాంతో ఏడడుగులు వేయబోతున్నారు. వచ్చే నెల 9న వివాహం, 14న రిసెప్షన్ జరగనుంది. ఇక భరత్ కాబోయే భార్య జెస్సీ గురించి చెప్పాలంటే.. ఆమె డెంటిస్ట్. దుబాయ్‌కి చెందిన యువతి.