విజయ్తో సినిమాపై సింగం డైరెక్టర్ కామెంట్ | Hari reveals why he could not do a film with Vijay | Sakshi
Sakshi News home page

విజయ్తో సినిమాపై సింగం డైరెక్టర్ కామెంట్

Feb 14 2017 11:57 AM | Updated on Sep 5 2017 3:43 AM

విజయ్తో సినిమాపై సింగం డైరెక్టర్ కామెంట్

విజయ్తో సినిమాపై సింగం డైరెక్టర్ కామెంట్

కోలీవుడ్ మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి. సింగం సీరీస్తో తిరుగులేని స్టార్ ఇమేజ్

కోలీవుడ్ మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి. సింగం సీరీస్తో తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరి, కెరీర్లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసినవి కేవలం 14 చిత్రాలు మాత్రమే. రేసీ స్క్రీన్ప్లేతో పాటు ఫ్యామిలి ఎమోషన్స్, యాక్షన్ సీన్స్తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించే హరి, ఇన్నేళ్ల కెరీర్లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయలేకపోయాడు. అయితే అందుకు కారణం ఏంటో కూడా చెపుతున్నాడు హరి.

సూర్య, విక్రమ్, విశాల్, లాంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హరి... విజయ్, అజిత్లతో సినిమాలు చేయలేకపోయాడు. సింగం తొలి భాగం రిలీజ్ అయిన సమయంలో విజయ్తో సినిమా చేసేందుకు చర్చలు జరిపిన హరి, సరైన నిర్మాత దొరక్క పోవటంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం సింగం 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన హరి, విజయ్ మార్కెట్ రేంజ్కు తగ్గ స్థాయిలో సినిమాను తెరకెక్కించే నిర్మాత దొరికితే సినిమా చేసేందుకు తాను సిద్ధమే అంటూ ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement