అన్నకు హ్యాండిచ్చినా.. తమ్ముడు చాన్స్‌ ఇచ్చాడు!

Gopi Sundar On Board for Akhil Akkineni - Sakshi

అక్కినేని నటన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సక్సెస్‌ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌ తన నాలుగో సినిమా చేయనున్నాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్‌ కొట్టాలని భావిస్తున్నాడు అఖిల్.

ఈ సినిమాలో అఖిల్‌కు తొలి విజయాన్ని అందించేందుకు అల్లు అరవింద్‌ కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకోవాలని భావించినా బడ్జెట్‌ను వీలైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో దేవీని పక్కన పెట్టేశారు. తరువాత తమన్‌ పేరు వినిపించినా ఫైనల్‌ గా గోపిసుందర్‌ను ఫిక్స్ చేశారన్న టాక్‌ వినిపిస్తుంది.

నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమాకు గోపిసుందర్ సంగీతమందించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమాకు నేపథ్యసంగీతం పూర్తి చేయకుండానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అలా అన్న నాగచైతన్యకు హ్యాండిచ్చిన సంగీత దర్శకుడు గోపి సుందర్‌ను తమ్ముడు అఖిల్ ఇప్పుడు తన తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిగా తీసుకోవటం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top