వాయిదా పడ్డ సినిమాలన్నీ ఒకే రోజు | Four Films Releasing On Same Date | Sakshi
Sakshi News home page

May 22 2018 11:34 AM | Updated on May 22 2018 1:21 PM

Four Films Releasing On Same Date - Sakshi

కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాలన్నీ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ చిత్రాలేవి బరిలో లేకపోవటంతో జూన్‌ 1న వాయిదా పడిన సినిమాలను ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్‌ హీరో నాగార్జున కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్‌ సినిమా జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మే 25నే రిలీజ్‌ కావాల్సి ఉండగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో జూన్‌ 1కి వాయిదా వేశారు.

అదే రోజు రిలీజ్‌ కు రెడీ అవుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం నా నువ్వే. కల్యాణ్‌ రామ్‌, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా మే 25నే రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా జూన్‌ 1కి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రాజ్ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమా కూడా ఎన్నో వాయిదాల తరువాత జూన్‌ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మహిళా దర్శకురాలు సంజన రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్ వింతవ్యాధితో బాధపడుతున్న యువకుడిగా కనిపించనున్నాడు.

జూన్‌ 1న రిలీజ్‌ అవుతున్న మరో ఆసక్తికర చిత్రం అభిమన్యుడు. విశాల్‌, అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళ్‌లో రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. అయితే తమిళ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్‌ కూడా రిలీజ్‌ చేయాల్సి ఉన్నా తెలుగులో స్టార్‌ హీరోల సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేశారు. తమిళ నాట మంచి సక్సెస్‌ సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement