ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ! | enduko emo released on september 12 | Sakshi
Sakshi News home page

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ!

Sep 2 2018 2:35 AM | Updated on Sep 2 2018 2:35 AM

enduko emo released on september 12 - Sakshi

నోయల్, పునర్నవి, నందు

నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మహేశ్వర క్రియేషన్స్‌పతాకంపై మాలతి వద్దినేని నిర్మించిన సినిమా ‘ఎందుకో ఏమో’. వినాయక చవితి పండగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కోటి వద్దినేని మాట్లాడుతూ–‘‘ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. కథా, కథనాలు కొత్తగా ఉంటాయి. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’అన్నారు. ‘‘మా బ్యానర్‌లో తొలి చిత్రమిది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రాజీ పడకుండా నిర్మించాం. మంచి లవ్‌స్టోరీకి కమర్షియల్‌ హంగులు జోడించాం’’ అన్నారు మాలతి. పోసాని కృష్ణ మురళి, ‘సుడిగాలి’ సుధీర్, నవీన్, ‘రాకెట్‌’ రాఘవ తదితరులు నటించిన ఈ సినిమాకు ప్రవీణ్‌ సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement