అవును, వాళ్లిద్దరూ మళ్లీ విడిపోయారు! | Elizabeth Hurley, Shane Warne split again | Sakshi
Sakshi News home page

అవును, వాళ్లిద్దరూ మళ్లీ విడిపోయారు!

Dec 17 2013 9:18 PM | Updated on Sep 2 2017 1:42 AM

అవును, వాళ్లిద్దరూ మళ్లీ విడిపోయారు!

అవును, వాళ్లిద్దరూ మళ్లీ విడిపోయారు!

హాలీవుడ్ నటి ఎలిజబెత్ హ్యార్లీ, ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ విడిపోయారంటూ గత సెప్టెంబర్ లో దాంపత్య జీవితానికి వీరిద్దరూ ముగింపు పలికారు అనే వార్తలు బలంగా వినిపించాయి.

హాలీవుడ్ నటి ఎలిజబెత్ హ్యార్లీ, ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ విడిపోయారంటూ గత సెప్టెంబర్ లో దాంపత్య జీవితానికి వీరిద్దరూ ముగింపు పలికారు అనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే అవన్ని గాలి వార్తలేనని... తాము కలిసే ఉన్నామని హ్యర్లీ, వార్న్ లు అప్పుడే ఖండించారు. పలు సందర్భాల్లో పలు రకాలుగా రూమర్లు జోరుగా షికారు చేశాయి. అయితే ప్రస్తుతం హ్యారీ, వార్న్ లు విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నారని అత్యంత సన్నిహితులు సమాచారాన్ని మీడియాకు అందించినట్టు హల్లో అనే ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. 
 
పత్రిక కథనానికి తోడుగా షేన్ వార్న్ ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలం చేకూర్చాయి. గతం గురించి ఆలోచించి బాధపడకూడదు. గతాన్ని తలుచుకుని బాధపడితే భవిష్యత్ దెబ్బతింటుంది. రేపటి రోజును ఊహించుకుంటూ ఆనందంగా కాలం గడపాల్సిందేనని.. నిన్నటి గురించి ఆలోచించడం ఎందుకు అని ట్విట్టర్ లో షేన్ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
అయితే షేన్ అమితంగా ఇష్టపడే హ్యార్లీ.. ఆ వార్లలన్ని అవాస్తవాలని, తమ మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. గత మూడు వారాలుగా వారిద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదని విశ్వసనీయ సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement