ఈ వారం ఆ సినిమాలకే..! | dubbing movies release in this weekend in tollywood | Sakshi
Sakshi News home page

ఈ వారం ఆ సినిమాలకే..!

May 11 2016 12:05 PM | Updated on Sep 2 2018 5:18 PM

ఈ వారం ఆ సినిమాలకే..! - Sakshi

ఈ వారం ఆ సినిమాలకే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మర్ సీజన్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ఈ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మర్ సీజన్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ఈ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందుకే సమ్మర్ సీజన్లో ప్రతీవారం కనీసం ఒక్క సినిమా అయినా థియేటర్లలో సందడి చేసేది. కానీ ఈ వారం ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కావటం లేదు. చాలా మంది హీరోలు తమ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.. ఈ టైంలో రిలీజ్ చేయడానికి మాత్రం ఇంట్రస్ట్ చూపించటం లేదు.

దీంతో ఈ వారం ఏకంగా ఆరు డబ్బింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. వీటిలో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న పెన్సిల్ సినిమా ఒక్కటే కొంత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు విజయ్ ఆంటోని హీరోగా తమిళ్లో ఘన విజయం సాధించిన పిచ్చైకారన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. శివకార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన పాత సినిమాను కేడి బిల్లా కిలాడి రంగాగా రిలీజ్ చేస్తున్నారు.

వీటితో పాటు రహదారి, స్ట్రాబెర్రీ, టీనేజ్ లాంటి మరో మూడు డబ్బింగ్  సినిమాలు ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో చాలా సినిమాలకు థియేటర్లు కూడా పెద్దగా దొరికే అవకాశం కనిపించటం లేదు. ఇప్పటికీ సరైనోడు, సుప్రీం సినిమాల హవా కొనసాగుతుండటం. 24 సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లను సాధిస్తుండటంతో ఈ డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల సమస్య తప్పేలా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement