బై బై బ్యాంకాక్‌

devdas bangkok shooting completed - Sakshi

ఇద్దరి ప్రొఫెషన్స్‌ వేరు వేరు. కొన్ని అనుకోని కారణాలతో ఒకే దారిలో నడవాల్సి వచ్చింది. దాని కోసం బ్యాంకాక్‌ దాకా వెళ్లారట. మరి అనుకున్న పని అయిందా? లేదా అని తెలియాలంటే మాత్రం సెప్టెంబర్‌ 27వరకూ ఓపిక పట్టండి అంటున్నారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్‌ నిర్మిస్తున్నారు.

నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్, నానీకి జోడీగా రష్మికా మండన్నా హీరోయిన్లుగా యాక్ట్‌ చేస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లింది చిత్రబృందం. అక్కడ క్లైమాక్స్‌ పార్ట్‌ పూర్తి చేసుకొని రిటర్న్‌ అవుతున్నారట. ఈ షెడ్యూల్‌తో సినిమా ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అయిందని దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top