లాక్‌డౌన్‌ : సాయంలోనూ ప్రత్యేకత చాటుకున్న విజయ్‌

Coronavirus Crisis : Vijay Devarakonda Two Important Announcement For Poor People - Sakshi

విజయ్‌ దేవరకొండ ఏది చేసినా విభిన్నంగా ఉండేలా చేస్తారు. సినిమాలే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రౌడీ తనదైనశైలీలో దూసుకెళ్తాడు. తాజాగా కరోనా వైరస్‌ సంక్షోభంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న సామాన్యులను చేయూతనివ్వడానికి ముందుకొచ్చాడు. దీని కోసం ఆయన రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంక్షోభ సమయంలో నిత్యవసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికోసం 25లక్షల రూపాయలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌(ఎం.సి.ఎఫ్‌) ఏర్పాటు చేశారు. అలాగే యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌(టి.డి.ఎఫ్‌)’ను ఏర్పాటు చేశారు.

రూ. కోటితో మొదలైన టీడీఎఫ్‌ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసిన వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారట. తన జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగులను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు విజయ్‌ తెలిపాడు. అలాగే లాక్‌డౌన్‌ వేళ కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారి కోసం. www.thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారు. దగ్గరలోని కిరాణ షాపుకు వెళ్లి సరకులను కొనుగోలు చేస్తే డబ్బులను పౌండేషన్‌ సభ్యులు చెల్లిస్తారు. ఈ 25లక్షలతో 2000 కుటుంబాల అవసరాలు తీర్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు విజయ్‌ దేవరకొండ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top