‘అర్జున’ విడుదలపై కరోనా ప్రభావం

Corona Effect: Rajashekar Movie Arjuna Postponed To March 13Th - Sakshi

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్నివాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. సినిమాను ముందుగా ఈ నెల 6న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న కారణంగా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతోంది.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్  ట్రెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇందులో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా  అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన  రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ...  అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top