ఆప్తమిత్రుడిని కోల్పోయాం : బాలయ్య | Balakrishna And Subbarami Reddy Condolences To Rishi Kapoor | Sakshi
Sakshi News home page

ఆప్తమిత్రుడిని కోల్పోయాం

Apr 30 2020 1:03 PM | Updated on Apr 30 2020 3:13 PM

Balakrishna And Subbarami Reddy Condolences To Rishi Kapoor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషి కపూర్ క్యాన్స‌ర్ కార‌ణంగా గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయ‌న మృతితో దేశ వ్యాప్తంగా విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు. రిషి కపూర్‌ మృతిపట్ల హీరో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరమన్నారు. భారతీయ సినిమాకు ఇది తీరని లోటని, వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. (రిషి క‌పూర్ లాస్ట్ ట్వీట్ అదే..)

ఆప్తమిత్రుడ్ని కోల్పోయాను..
సినీ నిర్మాత టి.సుబ్బరామి రెడ్డి స్పందిస్తూ..  రిషి కపూర్ మరణవార్త విని తీవ్ర దిగ్బ్రాంతి కి గురయ్యానని, ఒక ఆప్తమిత్రుడ్ని కోల్పోయానన్నారు, ఆయనతో తాము నిర్మించిన 'చాందిని' చిత్ర జ్ఞాపకాలు ఎప్పటికి పదిలంగా ఉంటాయన్నారు. ' రిషి కపూర్‌ నిజంగా గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ఆయన  హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా' అని పేర్కొన్నారు.
(చాకొలెట్‌ బాయ్‌ రిషి కపూర్‌...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement