మెగాఫోన్ పట్టిన హాసిక దత్ | Baby Doll Movie Direction Hasika dutt | Sakshi
Sakshi News home page

మెగాఫోన్ పట్టిన హాసిక దత్

Dec 31 2015 2:52 AM | Updated on Sep 3 2017 2:49 PM

మెగాఫోన్ పట్టిన హాసిక దత్

మెగాఫోన్ పట్టిన హాసిక దత్

సినీ దర్శకత్వాన్ని కొంచెం కష్టం కొంచెం సులభం అని అనవచ్చు. కొంచెం కష్టం అన్నది ఒకప్పుడు. కొంచెం సులభంగా ఇప్పుడు మారింది.

సినీ దర్శకత్వాన్ని కొంచెం కష్టం కొంచెం సులభం అని అనవచ్చు. కొంచెం కష్టం అన్నది ఒకప్పుడు. కొంచెం సులభంగా ఇప్పుడు మారింది. అందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఒక కారణం కావచ్చు. చాలా మంది దర్శకత్వ శాఖలో పని చేయకుండానే మెగాఫోన్ పట్టి విజయాలు సాధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నారీమణులు దర్శకురాళ్లుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గతంలో దర్శకురాళ్లుగా రాణించి కథానాయికలు ఉన్నారు.
 
 ఇక ఇటీవల చూస్తే వడచెన్నై చిత్రంతో కృత్తిక ఉదయనిధిస్టాలిన్, పూవరసన్ పీపీ చిత్రంలో హలీత్‌సమీన్, మాలై నేరత్తు మయక్కం చిత్రంతో గీతాంజిలి సెల్వరాఘవన్ వంటి వారు మెగాఫోన్ పట్టారు. తాజాగా ఈ కోవలోకి వర్ధమాన కథానాయకి హాసికదత్ చేరారు. 1 బంతి 4 రన్స్ 1 వికెట్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు  బేబీడాల్ అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తారు.
 
  మరో పక్క నాయకిగానూ నటిస్తూ ద్వి బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ భామ మాట్లాడుతూ తనకు దర్శకత్వం అంటే చాలా ఆసక్తి అన్నారు. హీరోయిన్‌గా నటిస్తున్నా దర్శకత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని చెప్పారు. ఈ బేబీడాల్ చిత్రాన్ని ఎస్.రవిశంకర్ సమర్పణలో కుత్తూస్ బాషా నిర్మిస్తున్నారని తెలిపారు. మానస్ అనే నవ నటుడు కథానాయకుడు నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకులు సముద్రకని,కే.భాగ్యరాజ్,మొట్టై రాజేంద్రన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. హాస్యభరిత కథా చిత్రంగా తెకెక్కుతున్న ఈ బేబీడాల్ చిత్ర షూటింగ్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు హాసిక దత్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement