దందా చేస్తాడా?

Baahubali Prabhas ' Danda ' Next Movie  - Sakshi

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు ప్రభాస్‌. ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు, తన కాల్షీట్లు పొందాలని ప్రతి నిర్మాత ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, ప్రభాస్‌ మాత్రం కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా చేస్తున్నప్పుడు ఒప్పుకున్న రెండు సినిమాలు తప్పితే వేరే ఏ సినిమానూ సైన్‌ చేయలేదు ప్రభాస్‌. ప్రస్తుతం సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హై బడ్జెట్‌ యాక్షన్‌ మూవీ ‘సాహో’ సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఆ తర్వాత ‘జిల్‌’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ–ప్రమోద్‌లు నిర్మించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత సొంత బేనర్‌ గోపీకృష్ణ మూవీస్‌పై ప్రభాస్‌ హీరోగా స్వీయదర్శకత్వంలో కృష్ణంరాజు ఓ సినిమా తెరకెక్కిస్తారని టాక్‌. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఫిల్మ్‌ చాంబర్‌లో గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌ ‘దందా’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేసింది. ఇదివరకు గోపీకృష్ణ మూవీస్‌ నిర్మించిన ‘బిల్లా’లో కృష్ణంరాజుతో కలిసి నటించారు ప్రభాస్‌. ఇప్పుడు కూడా ప్రభాస్‌ తన పెదనాన్నతో కలిసి నటిస్తారా? లేదా కృష్ణంరాజు డైరెక్షన్‌ మాత్రమే చేస్తారా? అనేది చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top