ఆగస్టులో 'అర్జున్ రెడ్డి' | arjun reddy Movie release date | Sakshi
Sakshi News home page

ఆగస్టులో 'అర్జున్ రెడ్డి'

Jul 26 2017 10:31 AM | Updated on Sep 5 2017 4:56 PM

ఆగస్టులో 'అర్జున్ రెడ్డి'

ఆగస్టులో 'అర్జున్ రెడ్డి'

పెళ్ళిచూపులు చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా

పెళ్ళిచూపులు చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'. షాలిని హీరోయిన్‌గా న‌టిస్తుంది.  భ‌ద్రకాళి పిక్చర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శక‌త్వంలో ప్రణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తుంది.

విల‌క్షణ పాత్రలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్రలో క‌న‌ప‌డ‌బోతున్నాడు. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌స్ట్ చివ‌రి వారంలో విడుద‌ల చేస్తున్నాయి.

పోస్టర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై వ‌చ్చిన అంచ‌నాల‌కు త‌గ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్‌కు క్రేజ్ ఏర్పడింది. విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 చిత్రాన్ని విడుద‌ల చేసిన ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వర‌లో మార్కట్లోకి విడుద‌ల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement