అవును... ఆమె స్పెషల్‌!

Arjun Kapoor breaks his silence on the wedding rumours with Malaika arora - Sakshi

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌ త్వరలో నటి మలైకా అరోరాఖాన్‌తో అర్జున్‌ ఏడడుగులు వేయనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అర్జున్‌ కపూర్‌ తాజాగా మాట్లాడుతూ– ‘‘జూన్‌లో నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొన్ని వార్తలతో మీడియా బిజీగా ఉంది. ఖాళీ సమయంలో వాటిలో కొన్ని సినిమా గాసిప్‌లను చదువుతూ ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నారు. యాక్టర్‌గా ‘పానిపట్‌’ సినిమా షూటింగ్, ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ నా పని నేను చేసుకుంటున్నాను. నాకిప్పుడు 33 ఏళ్లు. పెళ్లి విషయంలో నాకు తొందరలేదు. నిర్ణయించుకున్నప్పుడు నేనే చెబుతాను’’ అన్నారు. మరి.. ‘మలైకా అరోరాఖాన్‌ మీౖ లెఫ్‌లో స్పెషల్‌ పర్సన్‌నా?’ అనే ప్రశ్నకు ‘‘అవును.. స్పెషలే. మలైకానే కాదు.. కరీనా, అమృత, రణ్‌బీర్‌కపూర్‌ వీరంతా నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top