ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

Arjun Kapoor Is Being Widely Talked About For His Luxurious Watch - Sakshi

ముంబై : ఖరీదైన దుస్తులు, యాక్సెసరీస్‌తో ఆకట్టుకోవడం‍లో బాలీవుడ్‌ భామలకు తామేమీ తీసిపోమని హీరోలు సైతం స్టైలిష్‌ లుక్‌ కోసం భారీ ఖర్చుకు వెనుకాడటం లేదు. మలైకా అరోరాతో అనుబంధంతో వార్తల్లో నిలిచిన అర్జున్‌ కపూర్‌ తాజాగా లగ్జరీ వాచ్‌ ధరించి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు.

న్యూయార్క్‌లో ఇటీవల విహరించిన అర్జున్‌కపూర్‌ తన ఫోటోగ్రాఫ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలో అర్జున్‌ లుక్‌ కంటే ఆయన చేతి వాచీనే సోషల్‌ మీడియా ఫోకస్‌ పెట్టింది. అర్జున్‌ ధరించిన రోలెక్స్‌ ట్రెండీ మోడల్‌ వాచ్‌ ధర రూ 27 లక్షల పైమాటే. వాచ్‌ ప్రేమికులు ఈ వాచ్‌ను చూసి వావ్‌ అంటుంటే..మరికొందరు నెటిజన్లు ఇంతటి షో అవసరమా అంటూనే వాచ్‌ మాత్రం చాలా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top