నరకాసురన్‌లో అరవిందస్వామి
అరవింద్ స్వామి కొద్ది గ్యాప్ తరువాత విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు.
అరవింద్ స్వామి కొద్ది గ్యాప్ తరువాత విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. తనీఒరువన్( ధృవ తెలుగులో) చిత్రంలో ఆయన స్టైలిష్ విలనిజం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా మరోసారి హీరోగా తన సత్తా చాటడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే చతురంగవేట్టై-2 చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇపుడు నరకాసురన్ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు.
దృవంగళ్ 16 చిత్రంతో చిత్ర పరిశ్రమ మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్న యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దీన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అరవిందస్వామితోపాటు శ్రియ, సందీప్‌కిషన్ ఎంపికయ్యారు. తాజాగా యువ నటి ఆద్మికను ఎంపిక చేసినట్లు దర్శకుడు కార్తీక్ నరేన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఆద్మిక వీసైమురుక్కు చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల ఆదరణను పొందిన ఈ అమ్మడికిప్పుడు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయట. అందులో ఒకటి నరకాసురన్. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగంగా జరగుతున్నాయట. సెప్టెంబర్ 16న చిత్ర షూటింగ్‌ను ఊటీలో ప్రారంభించనున్నట్లు, అక్కడే 40 రోజులపాటు చిత్రీకరణ జరగుతోందని దర్శకుడు తెలిపారు.