హీరో కాల్‌ కోసం వెయిటింగ్‌ | AR Murugadoss wants to work with Ajith again | Sakshi
Sakshi News home page

హీరో కాల్‌ కోసం వెయిటింగ్‌

Dec 7 2018 5:31 AM | Updated on Dec 7 2018 5:31 AM

AR Murugadoss wants to work with Ajith again - Sakshi

అజిత్‌ హీరోగా 2001లో వచ్చిన ‘దీనా’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు మురుగదాస్‌. ఆ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత అజిత్‌ని ‘తల’ (నాయకుడు) అనే బిరుదుతో ఆయన అభిమానులు పిలుచుకుంటున్నారు. ‘దీనా’ తర్వాత అజిత్‌– మురుగదాస్‌ కలిసి పని చేయలేదు. వీరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందా? అని ఇద్దరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘అజిత్‌తో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?’ అనే ప్రశ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్‌కి ఎదురైంది. ‘‘ఏడెనిమిదేళ్లుగా ‘మా హీరోతో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు’ అంటూ అజిత్‌సార్‌ ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. అజిత్‌సార్‌కి సరిపోయే ఓ మాస్‌ కథని రెడీ చేశా. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి కథ వినిపిస్తాను. ‘దీనా’ చిత్రానికి సీక్వెల్‌ చేయడానికి కొన్ని పరిమితులున్నాయి. అయితే, విజయ్‌ సార్‌తో తీసిన ‘తుపాకి’కి సీక్వెల్‌ చేయొచ్చు. ఆయనతో ‘తుపాకి 2’ చేయాలనే ఆలోచన మాత్రం ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement