ఆటో రజినికి ఆశీస్సులు

Ap cm ys jagan mohan reddy clap and belssings for auto rajini movie - Sakshi

జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆటో రజిని’. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో ఈ చిత్రం ప్రారంభమైంది. బి.లింగుస్వామి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జొన్నలగడ్డ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘హరికృష్ణ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రమే మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌ కావడం ఆనందంగా ఉంది. సీయంగా ఎంతో బిజీగా ఉండి కూడా మా హీరోకి జగన్‌గారి బ్లెస్సింగ్స్‌ ఉండటం ఆనందంగా ఉంది. ఎలక్షన్‌ టైమ్‌లో మేము చేసిన ‘జననేత జగనన్న..’ పాట గురించి ప్రత్యేకంగా ఆయన మమ్మల్ని అభినందించటం జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top