అనుష్క.. భాగమతి ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది..

Anushka's Bhagmati First look Poster released - Sakshi

అరుంధతిలో జేజేమ్మగా, బాహుబలి చిత్రంలో దేవసేనగా తన నటనతో అందరి అనుష్క... తాజాగా భాగమతి ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. స్వీటీ (మంగళవారం) పుట్టినరోజు సందర్భంగా ...భాగమతి ఫస్ట్‌లుక్‌ను ‘షీ ఈజ్‌ కమింగ్‌’ అంటూ చిత్ర యూనిట్‌ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ‘జట్టు విరబోసుకుని....చేతిలో రక్తమోడుతున్న సుత్తితో’  కనిపిస్తున్న అనుష్కకు అప్పుడే ప్రశంసలు కురుస్తున్నాయి. హీరో రాణా దగ్గుబాటి ..అవుసమ్‌’ అంటూ భాగమతి ఫస్ట్‌లుక్‌ ను ట్విట్‌ చేశాడు.  కాగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఆది పినిశెట్టి విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు.

ఇక బాహుబలి -2 చిత్రం తరువాత అనుష్కను మళ్లీ తెరపై చూడలేదు. ఆమె తర్వాత చిత్రం కోసం అభిమానులు తహతహలాడుతున్నారనే చెప్పాలి. భాగమతి చిత్రాన్ని ముందు డిసెంబరు నెలలో విడుదల చేయాలనుకున్నా, తాజాగా జనవరిలో విడుదల చేయనున్నట్లు . అయితే ఆ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అనుష్క పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి ఆమె అభిమానులకు గిఫ్ట్‌గా అందించారు.

Back to Top