మెట్రోలో ఎవరుంటారు? | Anurag Basu opens up about the cast of Life in a Metro's sequel | Sakshi
Sakshi News home page

మెట్రోలో ఎవరుంటారు?

Aug 19 2018 4:45 AM | Updated on Aug 19 2018 4:46 AM

Anurag Basu opens up about the cast of Life in a Metro's sequel - Sakshi

అనురాగ్‌ బసు

‘బర్ఫీ, జగ్గా జాసుస్‌’ సినిమాల తర్వాత దర్శకుడు అనురాగ్‌ బసు రూపొందించబోయే నెక్ట్స్‌ సినిమా బాలీవుడ్‌లో ఓ  హాట్‌ టాపిక్‌. దానికి కారణం అందులో నటించబోయే నటీనటులే.  2007లో అనురాగ్‌ రూపొందించిన ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’కి సీక్వెల్‌గా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారాయన. ఇందులో కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్, అర్జున్‌ కపూర్, సిద్ధార్థ్‌ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. అలాగే రాజ్‌ కుమార్‌ రావ్, నవాజుద్ధిన్‌ సిద్ధిఖీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. ‘‘భారీ తారాగణం ఉన్నప్పుడు అందరి డేట్స్‌ సెట్‌ చేయడం శ్రమతో కూడుకున్న పని. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశాం. అందరి క్యాలెండర్‌ సంవత్సరం పాటు ఖాళీ లేదు. ఫైనలైజ్‌ అయిన తర్వాత అనౌన్స్‌ చేస్తాను’’ అన్నారు దర్శకుడు అనురాగ్‌ బసు. మరి సెకండ్‌ మెట్రోలో ఎవరెవరు భాగం అవుతారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement