విమల్‌తో మరోసారి | anjali acts with vimal | Sakshi
Sakshi News home page

విమల్‌తో మరోసారి

Nov 13 2014 1:04 AM | Updated on Apr 3 2019 9:04 PM

విమల్‌తో మరోసారి - Sakshi

విమల్‌తో మరోసారి

నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ పాగా వేస్తోంది. ఇంతకుముందు అంగాడి తెరు, ఎంగేయుం ఎప్పోదు, కలగలప్పు వంటి చిత్రాలతో విజయాల బాట పట్టిన అంజలి అనూహ్యంగా తన పినతల్లితో మనస్పర్థలు కారణంగా హైదరాబాదుకు వెళ్లిపోయి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైంది.

నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ పాగా వేస్తోంది. ఇంతకుముందు అంగాడి తెరు, ఎంగేయుం ఎప్పోదు, కలగలప్పు వంటి చిత్రాలతో విజయాల బాట పట్టిన అంజలి అనూహ్యంగా తన పినతల్లితో మనస్పర్థలు కారణంగా హైదరాబాదుకు వెళ్లిపోయి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ తెలుగమ్మాయి తాజాగా మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది.

ప్రస్తుతం సూరజ్ దర్శకత్వంలో జయం రవితో జతకడుతున్న అంజలికి మరో అవకాశం వచ్చింది. మాప్పిళ్లై సింగం అనే నూతన చిత్రంలో విమల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు తూంగానగరం, కలగలప్పు చిత్రాలు తెరకెక్కాయి. మూడోసారి విమల్‌తో రొమాన్స్‌కు సై అంది.

ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ సంస్థ అధినేత మదన్ నిర్మించనున్నారు. ఇంతకు ముందు మాన్ కరాటే వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఈయన ప్రస్తుతం ప్రభుసాల్మన్ దర్శకత్వంలో కయల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి విమల్, అంజలిల మాపిళ్లైసింగం చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement