బిగ్‌బాస్‌: ఎలిమినేట్‌ అయింది ఆమెనే! | Anchor Shyamala Eliminated From Bigg Boss 2 | Sakshi
Sakshi News home page

Jul 8 2018 11:26 AM | Updated on Jul 18 2019 1:45 PM

Anchor Shyamala Eliminated From Bigg Boss 2 - Sakshi

నాని

రేటింగ్స్‌ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్‌ టీమ్‌పై నీళ్లు చల్లారు..

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి నాలుగోవారం ఎలిమినేటయ్యే కంటెస్టెంట్‌ ఎవరో తెలిసిపోయింది. ఎన్నడు లేని విధంగా ఈ సారి ఎలిమినేషన్‌ ప్రక్రియకు ఎక్కువ మంది నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. తొలి రెండు వారాల్లో సామాన్యులైన సంజనా, నూతన నాయుడులు హౌస్‌ నుంచి నిష్క్రమించగా.. గత వారం కిరీటి దామరాజు ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే ఈ సారి కౌశల్‌, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్‌, దీప్తీ, గణేశ్‌, గీతా మాధురిలు ఇలా ఎక్కువ సంఖ్యలో నామినేట్‌ అవ్వడంతో ప్రేక్షకులు ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. 

శుక్రవారం ఎపిసోడ్‌లో కామన్‌ మ్యాన్‌ గణేశ్‌తో పాటు, సింగర్‌ గీతా మాధురి ప్రొటెక్ట్‌ అయినట్లు హోస్ట్‌ నాని ప్రకటించాడు. ఓ సామాన్యుడు హౌస్‌లోఉండాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు గణేశ్‌కు మద్దతు తెలపగా.. గీతా మాధురి సోషల్‌ మీడియా క్యాంపైన్‌తో గట్టెక్కినట్లు తెలుస్తోంది. ఆమెకు మద్దతుగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఓ ప్రణాళికతో హౌస్‌లోకి వెళ్లినట్లు అర్థమవుతోంది. ఈ ఇద్దరు సేఫ్‌ అవడంతో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరబ్బా? అని ప్రేక్షకుల తెగ ఆలోచిస్తున్నారు. 

ఎంత పనిచేశారు పిన్నిగారు?
హౌస్‌లో వదినగా పిలిచే దీప్తియే ఎలిమినేట్‌ కావొచ్చనుకున్నారు. అలా ఊహిస్తే అది బిగ్‌బాస్‌ ఎందుకవుతోంది.. ముందే చెప్పారుగా ఏమైనా జరుగొచ్చని.. అలానే ఎలాంటి గొడవలు పెట్టకోకుండా.. అందరి మన్ననలు పొందిన పిన్నిగారే ఎలిమినేట్‌ అయ్యారు. అదేనండి హౌస్‌లో పిన్నిగారినిపించుకున్న యాంకర్‌ శ్యామలే ఈ వారం ఎలిమినేట్‌ అయ్యారు. ఈ విషయం ఆమె స్వయంగా తెలిపి.. బిగ్‌బాస్‌ ఆశలపై నీళ్లు చల్లారు.  అసలే వీకెండ్‌.. ఎలిమిటయ్యేది ఎవరా? అనే ప్రేక్షకుల ఆతృతను క్యాచ్‌ చేసుకొని రేటింగ్స్‌ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్‌ టీమ్‌కు శ్యామల చర్య మింగుడు పడటం లేదు.

ఈ ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ ఒకరోజు ముందు జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌ వచ్చిందనుకుందో ఎమో కానీ.. ఇంటికి చేరిన వెంటనే ‘ మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.. ఇంటికి వచ్చాను. నాకొడుకు ఇషాన్‌తో ఆడుకుంటున్నాను.’ అని పోస్ట్‌ చేశారు. అయితే తన తప్పిదాన్ని గుర్తించిన శ్యామల వెంటనే ఆ పోస్ట్‌ను తొలిగించారు. అప్పటికే ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement