
సాక్షి, సినిమా : తెలుగు బుల్లితెరపై నటిగా కంటే యాంకర్‌గానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకంది యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె నటిస్తున్న చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోతున్నా యూత్ ఫాలోయింగ్ మూలంగా అవకాశాలు మాత్రం వరుసగా వచ్చిపడుతున్నాయి. ఆది సాయి కుమార్ తాజా చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’ సినిమాలో రష్మీ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఫ్యాన్స్ తో చిత్రం గురించి ఆమె ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఆమెకు పలువురిని నుంచి ఊహించని ప్రశ్నలే ఎదురయ్యాయి. కమెడియన్ సుధీర్ తో మరీ క్లోజ్‌గా ఉండటంను ప్రస్తావిస్తూ ఓ అభిమాని అతన్ని పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. ఆమె సమాధానమిచ్చింది. తాను .. సుధీర్ కలిసి ఎక్కువ షోలు చేస్తుండటం వల్లే ప్రేక్షకుల్లో అలాంటి భావన కలిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. షో హిట్ కావాలన్న ఉద్దేశ్యంతోనే తాను కాస్త సన్నిహితంగా ఉంటానే తప్ప.. అది చూసి తప్పుగా అనుకోవటం సరికాదని ఆమె తేల్చేసింది.
ఇక ఆమె నటిస్తున్న చిత్రాలు వరుసగా డిజాస్టర్లు అవుతుండటాన్ని లేవనెత్తిన ఓ అభిమాని.. ఆమె నటించిన తదుపరి చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ కూడా ఫ్లాప్ అయి తీరుతుందని కామెంట్ చేశాడు. దీనిపై కాస్త అసహనానికి లోనైన రష్మీ.. సక్సెస్-ఫెయిల్యూర్ అనేది ఒక్కరిపైన ఆధారపడి ఉండదని చెబుతూ.. నెగటివ్ గా థింక్ చేయటం మానమంటూ అతనికి బెస్టాఫ్‌లక్ చెప్పింది. రష్మీ తెలుగు భాషపై ఒకతను సెటైర్ వేయగా.. తన తల్లిదండ్రులు తెలుగు వాళ్లు కాకపోయినా.. చదువు సమయంలోనూ భాషతో పరిచయం లేకపోయినా తన శక్తిమేర ప్రయత్నిస్తున్నానంటూ సమాధానమిచ్చింది.