అచ్చమైన ప్రేమకథ.... | Anand, Shivatmika impress in Dorasani teaser | Sakshi
Sakshi News home page

అచ్చమైన ప్రేమకథ....

Jun 23 2019 12:14 AM | Updated on Jul 7 2019 11:45 AM

Anand, Shivatmika impress in Dorasani teaser - Sakshi

శివాత్మిక రాజశేఖర్‌, ఆనంద్‌ దేవరకొండ

తెలంగాణ ప్రాంతంలో 80వ దశకంలో  జరిగిన స్వచ్ఛమైన ప్రేమకథగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దొరసాని’. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లు హీరో హీరోయిన్‌లుగా పరిచయమవుతున్నారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌బెన్‌ సినిమాస్‌ నిర్మించారు. ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, యశ్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కేవీఆర్‌ మహేంద్ర దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

జూలై 12న సినిమాని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ‘‘శివాత్మిక, ఆనంద్‌ అద్భుతంగా నటించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో ‘దొరసాని’ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఆ మధ్య విడుదల చేసిన  ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే...’ బాగా హిట్టయింది. ఈ చిత్రంలోని మరో పాట ‘కలవరమై..’ను సోమవారం విడుదల చేస్తాం.  ఈ పాటకు కూడా మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. కల్మషం లేని ప్రేమకథ మా ‘దొరసాని’’ అంటున్నారు దర్శక–నిర్మాతలు. ప్రశాంత్‌. ఆర్‌ విహారి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement