తాగిన మైకంలో... | amrutha nilayam getting-ready for elease | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో...

Apr 23 2019 12:32 AM | Updated on Apr 23 2019 12:32 AM

amrutha nilayam getting-ready for elease - Sakshi

మమత, విజయ్

విజయ్, మమత, రిషివర్మ, సుహాసన ముఖ్య తారలుగా రాజా విక్రమ నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమృత నిలయం’. ఆర్‌.పి సమర్పణలో అను ఫిల్మ్‌ బ్యానర్‌పై రామమోహన్‌ నాగుల, ఎం.ప్రవీణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. రాజా విక్రమ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో యువత తాగిన మైకంలో పొరపాట్లు చేస్తున్నారు.

వాటివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా మా ‘అమృత నిలయం’ తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘వైజాగ్‌లో ఎక్కువ శాతం మా సినిమా చిత్రీకరణ జరిపాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి  సంగీతం: రామ్‌.

Advertisement
 
Advertisement
Advertisement