Sakshi News home page

అమితాబ్ ను వెంటాడుతున్న పాతకేసు

Published Wed, May 11 2016 12:07 PM

అమితాబ్ ను వెంటాడుతున్న పాతకేసు - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మెడకు పాతకేసు చట్టుకుంది. అమితాబ్పై ఉన్న 2001 నాటి ఆదాయపన్ను కేసును మళ్లీ ప్రారంభించేందుకు ఆదాయపన్ను శాఖకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. బుధవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రఖ్యాత టీవీ షో 'కౌన్ బనేగా క్రోర్పతి'లో నటించడం ద్వారా అమితాబ్ ఆర్థిక కష్టాల నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ప్రజల్లో విశేష ఆదరణ పొందిన ఈ షోలో నటించినందుకుగాను బిగ్ బీ అప్పట్లో భారీ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకున్నారు. అయితే ఈ  షో ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి 2001-02 సంవత్సరంలో అమితాబ్ కోటి 66 లక్షల రూపాయలు పన్ను చెల్లించకుండా బకాయిపడినట్టు ఆదాయపన్ను శాఖ చెబుతోంది. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు 2012 జూలైలో అమితాబ్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కాగా ఆదాయపన్ను శాఖ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ అమితాబ్కు చుక్కెదురైంది. 

Advertisement

What’s your opinion

Advertisement