
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోర్‌పతి(కేబీసీ) 11వ సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్ టీజర్ వీక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. టిక్‌టాక్ వీడియోలు చేయడానికి ఆసక్తి చూపే యువకుడిని సీనియర్ బచ్చన్ చిట్కాలు అడిగి తెలుసుకుంటారు. ఆద్యంతం సరదాగా సాగే ఈ సంభాషణలో సదరు యువకుడు టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియోలను స్క్రీన్‌పై చూపించారు. అంతేకాక టిక్‌టాక్ వీడియోలు ఎలా చేయాలో తెలుపడంతో.. షో వీక్షకులకు కనువిందు చేయనుంది.
మరోవైపు, ఉన్నావ్‌కు చెందిన యువతి నుపూర్ చౌహాన్ ఇతివృత్తాన్ని తెలిపే గాథ కూడా ఇవాళ టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్‌లో జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ట్యూషన్ టీచర్‌గా రాణించడంపై తన అనుభవాలను పంచుకుంది. కేబీసీ షోలో హాట్ సీటు పొందే అవకాశం రావడంతో ఆమె స్పూర్తిదాయకంగా మారింది. కాగా ప్రేక్షకుల అభిమనం చురగొన్న కేబీసీ షో, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9గంటలకు ప్రసారమవుతోంది.
Tonight's #KBC will be all about celebrating the spirit of never giving up. Don't miss an inspiring display of determination, at 9 PM. @SrBachchan pic.twitter.com/vzRzYPUJtY
— Sony TV (@SonyTV) August 22, 2019