
సినీ అభిమానులకు గ్రేట్ న్యూస్!
సినిమా అభిమానులకు ఉత్సాహం కలిగించే వార్త. ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ లో బాలీవుడ్ లో సినిమా తెరకెక్కనుంది.
ముంబై: సినిమా అభిమానులకు ఉత్సాహం కలిగించే వార్త. ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ లో బాలీవుడ్ లో సినిమా తెరకెక్కనుంది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తొలిసారిగా కలిసి నటించే సినిమా ఖరారైంది. సినిమా టైటిల్ ’థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’.. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించనున్న ఈ సినిమాను ‘ధూమ్ 3’ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించనున్నాడు. హీరోయిన్లను ఇంకా ఎంపిక చేయలేదు. 2018 దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారని హిందీ సినిమా విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
అమితాబ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని ఆమిర్ ఖాన్ ఇంతకుముందు పేర్కొన్నాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన 'ధూమ్ 3' సినిమాలో ఆమిర్ ఖాన్ నటించాడు. ఆయన డైరెక్షన్ లో అమితాబ్ ఇంతవరకు నటించలేదు.