సింగర్‌ ప్రెగ్నెన్సీ నిజమే.. త్వరలో పెళ్లి! | American Rapper Cardi B Is Pregnant, Husband Confirms | Sakshi
Sakshi News home page

సింగర్‌ ప్రెగ్నెన్సీ నిజమే.. త్వరలో పెళ్లి!

Apr 8 2018 4:02 PM | Updated on Apr 4 2019 3:20 PM

American Rapper Cardi B Is Pregnant, Husband Confirms - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌ : అమెరికన్‌ పాప్‌ సింగర్‌, యువ సంచలనం కార్డీ బి ప్రెగ్నెన్సీ వదంతులపై శనివారం ఓ క్లారిటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె తొలి బిడ్డకు జన్మనివ్వనుందని, గర్భం దాల్చిందని ప్రచారం కాగా, అందులో వాస్తవం లేదంటూ సింగర్‌ కొట్టిపారేశారు. అయితే శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని బీ కేర్‌ఫుల్‌ అంటూ పాడిన పాడకు విశేష స్పందన వస్తోంది. అంతకంటే ఎక్కువగా ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అవ్వడం. ఆమె గర్బం ధరించినట్లు తెలియకుండా చేయాలని చేసిన యత్నం సఫలం కాలేదు.

తొలుత కాస్త ఇబ్బంది పడ్డా స్టేజీపై పాడ పాడుతుంటే ఆమె గర్భం దాల్చినట్లు లైవ్‌ షో చూసిన వాళ్లు గుర్తించి సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టేశారు. ఈవెంట్‌ ముగిశాక గత కొన్ని నెలలుగా ఆమెతో సహజీవనం చేస‍్తున్న ఆఫ్‌సెట్‌ ఈ శుభవార్తను ట్వీట్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు. కార్డీ బి, నేను కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నామని, తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు పోస్ట్‌ చేశారు. సింగర్‌ తొలిసారి తల్లి అవుతుండగా,  ఆఫ్‌సెట్‌ నాలుగోసారి తండ్రి కానున్నారు. మాజీ భార్యతో అతడికి ముగ్గురు సంతానం ఉన్న విషయం తెలిసిందే. కార్డీ బి, ఆఫ్‌సెట్‌లు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement